![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1025 లో.. వసుధారకి ప్రతీ విషయంలో హెల్ప్ చేసున్నాడని రాజీవ్ కోపంగా మను అటుగా వెళ్తుంటే అడ్డుపడతాడు. ఇద్దరికి మధ్యలో గొడవ జరుగుతుంది. ఒకరికొకరు కాలర్ పట్టుకొని గొడవపడతారు. నీ సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చుకుంటారు.
ఆ తర్వాత మనుకి వసుధార కాల్ చేయాలనుకుంటుంది. మనుకి వసుధార ఫోన్ చేసి.. బర్త్ డే సెలబ్రేట్ చేసినందుకు చాలా థాంక్స్ అని చెప్తుంది. అలా ఏం చెప్పకండి అని మను అంటాడు. ఇంత తక్కువ టైమ్ లో.. అసలు ఆ జర్నీని ఎలా రెడీ చేశారని వసుధార అడుగుతుంది. తక్కువ టైమ్ లో ఏం కాదు.. వారం రోజులు టైమ్ తీసుకున్నాను. అందుకు మహేంద్ర సర్ హెల్ప్ తీసుకున్నాను. మీకు ఇలాంటివి ఇష్టం ఉండవని తెలిసినా ధైర్యం చేసానని మను అంటాడు. ఇప్పటికి నాకు సెలెబ్రేషన్స్ అంటే నచ్చవనే చెప్తాను. మీరు సెలబ్రేషన్స్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. రిషి సర్ ని గుర్తుకు చేశారని వసుధార అంటుంది. మీరు నాకు ఇంకొక హెల్ప్ చేస్తారా అని వసుధార అడుగుతుంది. ఏంటో చెప్పండి అని మను అంటాడు. రిషి సర్ ని వెతకడంలో హెల్ప్ చెయ్యాలని అనగానే.. తప్పకుండా చేస్తానని మను చెప్తాడు. దాంతో వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత రాజీవ్, శైలేంద్ర ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటారు. ప్రతిసారీ ఇలా మన ప్లాన్ కి ఆ మను అడ్డు వస్తున్నాడని ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత శైలేంద్ర ఒక రౌడీకి ఫోన్ చేసి ఒకడిని లేపేయ్యాలని చెప్తాడు. మరొకవైపు మను కాలేజీలో బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసినందుకు వసుధార హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత మీకు మను కి గతం ఉందా? ఎందుకు మను గారు వచ్చినప్పుటి నుండి మీలో చేంజ్ వచ్చిందని అనుపమని వసుధార అడుగుతుంది. ఇలా వసుధార అడిగేసరికి అనుపమకి కోపం వస్తుంది. నువ్వు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు.. ఇంకెప్పుడు ఇలా అడుగకు అంటు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కచ్చితంగా వీళ్ళ మధ్య గతం ఉందని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |